నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం గ్రూపు స్వశక్తి మహిళల సంఘాలు ఆర్థికంగా ఎదగాలని బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన సరస్వతి, వీరాంజనేయ స్వశక్తి మహిళ సంఘాలకు రుణాల కోసం ఎంసీబీ ప్రాపార్మాలను సిద్ధం చేశారు. అయితే అందులో కొద్దిపాటి పేర్లు తప్పిదాలు పడ్డాయని వాటిని సరిచేయించడానికి వళ్లెంకుంట సెక్టార్ సిసి నాగరాజు వద్దకు బుధవారం కొయ్యుర్ లో ఉన్న మండల సమాఖ్య స్వశక్తి కార్యాలయం వద్దకు 20 మంది గ్రూపు మహిళలు ఉదయం 10 గంటలకు వచ్చారు. మధ్యాహ్నం అయిన సిసి రాకపోవడంతో గంటలపాటు కార్యాలయం ముందు నిరీక్షణ చేశారు. అయిన రాకపోవడంతో సిసికి మహిళలలు ఫోన్ చేసిన రెస్పాన్స్ కాలేదని వాపోయారు. సిసికి నవ తెలంగాణ ఫోన్ చేసిన అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. పొదుపు సంఘాల అభివృద్ధికి పల్లెల్లోకి నేరుగా వెళ్లి బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన సిసి మహిళలు కార్యాలయం వద్దకు వచ్చిన పట్టించుకోకపోగా,నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై గ్రూపు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.
సీసీ కోసం స్వశక్తి మహిళలు నిరీక్షణ.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



