నవతెలంగాణ-హైదరాబాద్ : టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో తండ్రి విర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటన సికింద్రబాద్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని ఓ మహిళ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. అయితే.. వేరే వారి వీర్యకణాలతో వైద్యులు సంతానం కలిగించారు. సదరు దంపతులను అనుమానం వచ్చిన డీఎన్‌ఏ టెస్టు చేయించుకోగా, శిశువు డీఎన్‌ఏ వేరే వారిదిగా తేలింది.
దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా.. నిన్న రాత్రి ఆ సెంటర్‌ను అదుపులోకి తీసుకొని రాత్రి మొత్తం పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో డా.నమృతను అరెస్ట్ చేసిన పోలీసులు.. రాత్రి గోపాలపురం పీఎస్‌కు తరలించారు. రాత్రి 2.30 గంటల వరకు జరిగిన తనిఖీల్లో కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే తనిఖీల సమయంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిబ్బందిని లోపలే ఉంచి పోలీసులు ప్రశ్నించారు. రాత్రి 2:30 గంటలకు తనిఖీలు పూర్తయిన తర్వాత సిబ్బందిని పోలీసులు పంపించారు.