Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకరెంటు మీటర్‌ రీడర్లకుసెమీ స్కిల్డ్‌ ఆర్డర్‌ ఆమలు చేయాలి

కరెంటు మీటర్‌ రీడర్లకుసెమీ స్కిల్డ్‌ ఆర్డర్‌ ఆమలు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌బ్యూరో
కరెంటు మీటర్‌ రీడర్లకు ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్‌) ఇచ్చిన సెమీ స్కిల్డ్‌ ఆర్డర్‌ను దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌)లో కూడా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ మీటర్‌ రీడర్స్‌ యూనియన్‌ కోరింది. సోమవారంనాడిక్కడి ప్రకాశం హాల్‌లో ‘మన భవిష్యత్‌ కార్యాచరణ సభ’ ను యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు దోమికొండ సునీల్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. 327 యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌ శ్రీధర్‌ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. మీటర్‌ రీడర్లకు నెలకు కేవలం 12 నుంచి 14 రోజులు మాత్రమే పని ఉంటోందనీ, మిగిలిన రోజుల్లో పనిలేక అవస్థలు పడుతున్నారని యూనియన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ చెప్పారు. తమకు ఇస్తున్న వేతనం అతి తక్కువగా ఉంటోందనీ, తమకు నెలరోజుల పని కల్పించాలని కోరారు. దీనిపై టీజీఎన్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ వరుణ్‌రెడ్డి మీటర్‌ రీడర్లకు నెలరోజుల పని కల్పిస్తూ, ఉత్తర్వులు ఇచ్చారనీ, అదే తరహాలో టీజీఎస్పీడీసీఎల్‌లో కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎన్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ త్వరలో విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి, ఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీతో కూడా అదే తరహా ఉత్తర్వులు ఇప్పిస్తామని చెప్పారు. డిస్కం యాజమాన్యం సెప్టెంబర్‌ 30లోపు నిర్ణయం తీసుకోవాలనీ, లేనిపక్షంలో తాము సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని మీటర్‌ రీడర్లు హెచ్చరించారు. సమావేశానికి ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మీటర్‌ రీడర్లు హాజరయ్యారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad