Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఏపీ, పంజాబ్‌, ఒడిశాకు సెమీ కండక్టర్‌ పరిశ్రమలు

ఏపీ, పంజాబ్‌, ఒడిశాకు సెమీ కండక్టర్‌ పరిశ్రమలు

- Advertisement -

– లక్నో మెట్రో రైలుకు గ్రీన్‌ సిగల్‌
– అరుణాచల్‌ప్రదేశ్‌లో 700 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు : కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త సెమీ కండక్టర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ యూనిట్లను ఒడిశా, పంజాబ్‌లో సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మూడు రాష్ట్రాల్లో మొత్తం రూ.4,600 కోట్లతో పెట్టే నాలుగు సెమీకండక్టర్‌ ప్రాజెక్టులు 2,034 మందికి ఉద్యోగాలు కల్పిస్తాయని అంచనా వేస్తున్నారు. మంగళవారం నాడిక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్‌ సమావేశమైంది. సమావేశ అనంతరం కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రివర్గం నిర్ణయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో సెమీ కండక్టర్‌ తయారీ యూనిట్‌ను దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్‌ కో లిమిటెడ్‌ సంస్థ సహకారంతో అడ్వాన్స్డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజ్‌ టెక్నాలజీస్‌ (ఎఎస్‌ఐపీ) ఏర్పాటు చేస్తుంది. దీని వార్షిక సామర్థ్యం 96 మిలియన్‌ యూనిట్లు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను మొబైల్‌ ఫోన్లు, సెట్‌-టాప్‌ బాక్సులు, ఆటోమొబైల్‌ అప్లికేషన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో మహానగరంలో మెట్రో రైలు ఏర్పాటుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. అందులో భాగంగా లక్నో మెట్రో ఫేజ్‌ 1బి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ దశలో రూ. 5,801 కోట్ల వ్యయంతో 11.65 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయిం చింది. అలాగే అరుణాచల్‌ప్రదేశ్‌లో 700 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయ నుంది. ఈ ప్రాజెక్టు కింద రూ. 8,146 కోట్లు కేటాయించాలని భావించింది. దీనిని 72 నెలల్లో పూర్తి చేయాలని గడువు విధిస్తూ క్యాబినెట్‌ నిర్ణయించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img