జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్..
అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం- 2025 వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయం కలెక్టర్ వి.సి చాంబర్ లో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించి సీనియర్ సిటిజన్స్ తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ఈ నెల 12 నుండి 19 వరకు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు పోస్టర్లను ఆవిష్కరించడం, 2 వ రోజు జిల్లా స్థాయిలో వృద్ధుల చట్టాలపై ఆరోగ్యం చురుకైన వృద్ధాప్యం పై అవగాహన కార్యక్రమం,3వ రోజు వృద్దాశ్రమాల్లో ఆటల పోటీలు వినోద కార్యక్రమాలు,4వ రోజు వాకధాన్ సీనియర్ సిటిజన్స్ హక్కులపై అవగాహన ర్యాలీ నిర్వహించాలని తెలిపారు.
5వ రోజు జిల్లా స్థాయిలో వయో వృద్ధుల చట్టం-2007 పై అవగాహన ఏర్పాటు చేయాలని, 6వ రోజు గ్రామస్థాయిలో సర్పంచ్ ఇతర ప్రతినిధుల తో అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామం లో హెల్త్ క్యాంపు లు ఏర్పాటు చేయాలని, 7వ రోజు జిల్లా స్థాయిలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహణ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.వయో వృద్ధుల కు సీనియర్ సిటిజన్ చట్టం ద్వారా కలిగే హక్కులను తెలియజేయాలని వారికి ఆరోగ్యం, పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పించాలని, ఎవరికైనా ఏమైనా సమస్య లు ఉంటే 14567 టోల్ ప్రీ నెంబర్ కు తెలియజేయాలనీ కలెక్టర్ సూచించారు.అదనపు కలెక్టర్ కె సీతారామారావు మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో వయో వృద్ధుల కొరకు ఉచిత వైద్య శిభిరాలు నిర్వహించాలని సీనియర్ సిటిజన్ యాక్ట్ పై అవగాహన కల్పించాలని అన్నారు.
అనంతరం సూర్యాపేట జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. 1 నవంబర్ 2025 నుండి 31 జనవరి 2026 వరకు బాల్య వివాహల నిర్ములనకై 100 రోజుల ప్రచారోద్యమం గోడ పత్రికను ఆవిష్కరించారు. బాల్య వివాహాలు గురించి సమాచారం తెలిస్తే వెంటనే చైల్డ్ లైన్ 1098 కు తెలియజేయాలనీ విషయాలు గొప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహ రావు వయో వృద్ధుల కమిటీ మెంబెర్స్ & అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు , సభ్యులు, జి.విద్య సాగర్, sd.హమీద్ ఖాన్ ,బోళ్ళు రాంబాబు, గజ్జల కృష్ణా రెడ్డి,కిరణ్మయి,జావీద్ ఖాన్, వినోద్ కుమార్,సిబ్బంది పాల్గొనారు.



