Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుకుల కళాశాలను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

గురుకుల కళాశాలను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
పట్టణంలోని పిప్రి రోడ్డులో గల వెల్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్పర్సన్ పి.శ్రీదేవి బుధవారం సందర్శించారు. ఇటీవలే కళాశాలలో ఇంటర్ బైపీసీ ద్వితియ సంవత్సరము చదువుతున్న నిజాంసాగర్ మండలం ఆరెపల్లి కీ చెందిన విద్యార్ధి గడ్డం సంతోష్ (17) ఆత్మహత్య చేసుకున్న ఘటన పై కళాశాల సిబ్బందిని, విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు చదువును ఒత్తిడి గా తీసుకోవద్దని ఇష్టంతో చదివి సులభంగా అర్థం అయ్యేలా చేసుకోవాలని సూచించారు.కష్టపడి చదివితే ఏ రంగంలో అయిన పట్టు సాధించవచ్చని దాని కోసం ఒత్తిడి గురి కావద్దని అన్నారు. అనంతరం విద్యార్థుల తరగతి గదులను,వసతి గృహాన్ని,కళాశాల పరిసరాలను పరిశీలించారు.  బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్,మద్దుల గంగారాం,పట్టణ సీఐ సత్యనారాయణ గౌడ్, కోర్ట్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -