- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జన్నారం మండల మాజీ జడ్పీటీసీ లావుద్య భక్షి నాయక్ సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో కేటీర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బక్షి నాయక్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ ఖండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖానాపూర్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులని గెలుపు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో క్యాన్సర్ నాయక్ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



