ఫోక్సో కేసులో దోషికి 21 ఏళ్ల జైలు శిక్ష.. రూ.30వేల జరిమానా
నవతెలంగాణ – కట్టంగూర్
పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ నల్లగొండ జిల్లా కోర్టు 21 ఏండ్ల కారాగార శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. కేసు వివరాలను కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ వెల్లడించారు. నార్కట్‌పల్లి మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన వలిగొండ వెంకన్న మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ బాలిక 2018 ఏప్రిల్ 20న కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేశాడు. శాలిగౌరారం అప్పటి సీఐ క్యాస్టోరెడ్డి నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం అంతిమ నివేదికను కోర్టులో సమర్పించాడు. దీనిపై గురువారం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వాదనలు ముగియగా సదరు వ్యక్తి దోషిగా తేలాడు. దీంతో అతడిని 21 ఎండ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి రోజా రమణి తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు.
నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES