మూడు రోజుల్లో నష్టం వెంటాడుతోన్న అమెరికా భయాలు
ముంబయి : దలాల్ స్ట్రీట్‌ను అమెరికా భయాలు వెంటాడుతున్నాయి. వరుసగా మూడో రోజూ మార్కెట్లు నష్టపోయాయి. వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను అమెరికా దుర్మార్గంగా బంధించి భౌగోళిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు భారత్‌పై మరిన్ని సుంకాలు పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేస్తోన్నాయి. యుఎస్ ఆంక్షలు కొనసాగుతోన్న వేళ రిలయన్స్ ఇండిస్టీస్ దొడ్డిదారిన రష్యా నుంచి చమురు దిగుమతులను చేసుకుంటుందన్న బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ఆ కంపెనీ షేరును ఒత్తిడికి గురి చేస్తోంది. మరో ప్రధాన సూచీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రతికూలతను ఎదుర ొ్కంటుంది. ఈ పరిణామాలతో మూడు రోజుల్లో సెన్సెక్స్‌్ 1,144 పాయింట్లు పతనమయ్యింది. బుధవారం సెషన్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 102 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 84,961 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37.95 పాయింట్లు తగ్గి 26,141 వద్ద నమోదయ్యింది. సెన్సెక్స్ 30 సూచీలో మారుతీ సుజుకీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా లాభపడ్డాయి. నిఫ్టీలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.45 శాతం, 0.39 శాతం లాభపడటం విశేషం. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి
సెన్సెక్స్ 1,144 పాయింట్ల పతనం
- Advertisement -
- Advertisement -



