Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeసినిమాసెన్సిబుల్‌ లవ్‌స్టోరీ

సెన్సిబుల్‌ లవ్‌స్టోరీ

- Advertisement -

శివ కందుకూరి హీరోగా ‘చారు వాలా’ అనే చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్‌ ఆర్‌. పాపుడిప్పు నిర్మిస్తున్నారు. దీనికి ప్రమోద్‌ హర్ష రచన, దర్శకత్వం వహించారు. బుధవారం మేకర్స్‌ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ, ‘అందరికీ కనెక్ట్‌ అయ్యే టైటిల్‌ ఇది. కథను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను వెంకట్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఎమోషన్‌తో బయటకు వెళ్తారు’ అని అన్నారు.
‘ప్రమోద్‌ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. మా నిర్మాత ఈ కథను మాకంటే ఎక్కువగా నమ్మారు. ఈ చిత్రాన్ని చూసి వచ్చిన తరువాత తండ్రితో కాసేపు మాట్లాడతారు. థియేటర్‌ నుంచి ఓ మంచి ఎమోషన్‌తోనే బయటకు వస్తారని మాత్రం కచ్చితంగా చెప్పగలను’ అని హీరో శివ కందుకూరి చెప్పారు.
దర్శకుడు ప్రమోద్‌ హర్ష మాట్లాడుతూ, ‘నేను రాసుకున్న పాత్రలు, కథ నుంచే ‘చారు వాలా’ టైటిల్‌ను తీసుకున్నాను. ప్రతీ మనిషి జీవితంలో జరిగే సంఘటనలే మా చిత్రంలో ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు. ‘ఈ మూవీలోని కొన్ని సీన్లను ఆల్రెడీ చూశాను. నా కంట్లోంచి నీళ్లు వచ్చాయి. ఇదొక సెన్సిబుల్‌ లవ్‌ స్టోరీ’ అని నిర్మాత వెంకట్‌ ఆర్‌.పాపుడిప్పు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad