– రాష్ట్రంలో 400 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ : సీనియర్ లివింగ్ ఆపరేటర్ అయిన కొలంబియా పసిఫిక్ ఆధ్వర్యంలోని సెరీన్ కమ్యూనిటీస్ మంగళవారం ప్రతిమా గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం తెలంగాణలో సెరీస్ అధికారిక ప్రవేశాన్ని సూచిస్తుందని పేర్కొంది. హైదరాబాద్‌లో సుమారు రూ.400 కోట్ల పెట్టుబడులకు యోచిస్తోన్నట్టు ఇరు సంస్థలు తెలిపాయి. ఈ భాగస్వామ్యం ద్వారా సరీన్ కమ్యూనిటీస్ అంతర్జాతీయ నైపుణ్యానికి తోడు ప్రతిమా గ్రూప నిర్మాణ విశిష్టత కలయికలో రెండు ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించాయి. శంకర్‌పల్లిలో తమ మొదటి ప్రాజెక్ట్ సరీన్ బిల్వాణి వన్‌కు రేరా అనుమతి లభించిందని తెలిపింది. రెండవ ప్రాజెక్ట్ వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు సెరీస్ కమ్యూనిటీస్ బై కొలంబియా పసిఫిక్ సీఈఓ రాజగోపాల్ తెలిపారు. సరీన్ కమ్యూనిటీస్‌తో భాగస్వామ్యం ద్వారా తాము హైదరాబాద్‌కు అంతర్జాతీయ ప్రమాణాల సీనియర్ లివింగ్ అనుభవాన్ని అందిస్తునున్నామని ప్రతిమా గ్రూప్ డైరెక్టర్ ఎబివిఎస్ ప్రకాశ్ రావు పేర్కొన్నారు.
ప్రతిమా గ్రూపుతో సెరీస్ కమ్యూనిటీస్ భాగస్వామ్యం
- Advertisement -
- Advertisement -



