డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ఇద్దరు మృతి
మరో ఇద్దరికి గాయాలు
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
కారు డీవైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన హైదరా బాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ రఘుబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఆశ్రిత్ రెడ్డి (22), బాలాజీ మణికంఠ శివసాయి(23), రాహుల్, శ్రీకాంత్ స్నేహితులు. వీళ్లు నలుగురు వృత్తిరీత్యా ఐటీ ఉద్యోగులు. వీరు ఆదివారం తెల్లవారుజామున క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు తార్నాకకు కారులో బయలు దేరారు. మౌలాలి నుంచి తార్నాక వెళ్తున్న క్రమంలో తెల్లవారుజామున 6 గంటల సమయంలో లాలాపేట దోబీఘాట్ వద్ద పొగ మంచు కారణంగా డివైడర్ కనిపించలేదు. దాంతో మౌలాలి బ్రిడ్జిపై నుంచి వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. దాంతో కారు నడుపుతున్న ఆశ్రిత్ రెడ్డి, పక్క సీటులో కూర్చున్న బాలాజీ మణికంఠ శివసాయి అక్కడిక్కడే మృతిచెందారు. వెనుక సీట్‌లో కూర్చున్న రాహుల్, శ్రీకాంత్ గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. గాయాలైన వారిని మల్కాజిగిరిలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు.
లాలాపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



