Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విధుల్లో చేరిన సెర్ప్ సిబ్బంది.! 

విధుల్లో చేరిన సెర్ప్ సిబ్బంది.! 

- Advertisement -

ఆర్డర్ కాపీలు ఇవ్వడంలో ఆలస్యం.?
నవతెలంగాణ – మల్హర్ రావు

ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన డిపిఎం,ఏపీఎం,సిసిల సెర్ప్ కౌన్సెలింగ్ పూర్తియినట్లుగా తెలుస్తోంది. ఏపీఎంలు ఆర్డర్ కాపీలతో వారికి కేటాయించిన మండలాలకు వెళ్లి విధుల్లో చేరినట్లుగా సమాచారం. కానీ ట్రాన్స్ పర్ ఆయిన సిసిలకు మాత్రం ఆర్డర్ కాపీలు ఇవ్వడంలో అలస్యమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 38 మంది సీసిలు ఉండగా ఇందులో ఎల్1 సిసిలు ఇద్దరు, ఎల్2 సిసిలు 32, ఎమ్మెస్ సిసిలు ఆరుగురు ఉండగా,మండలంలో ఆరుగురు సిసిలు ఉన్నారు.వీరికి ఆగస్టు 29న కౌన్సెలింగ్, 30న పోస్టింగ్, ఈనెల1న రిపోర్టింగ్ ఇవ్వాలి కానీ ఆలస్యంగా ఈ నెల1న కౌన్సెలింగ్ చేపట్టినట్లుగా తెలుస్తోంది.

కౌన్సెలింగ్ పూర్తియి రెండు వారాలు గడుస్తున్న ట్రాన్స్ పర్  ఆర్డర్ మాత్రం రాలేదని తెలుస్తోంది. ట్రాన్స్ పర్ ఆర్డర్ చేతికి రాకున్నా సిసిలు వీధుల్లో చేరడం మరో విశేషం. సెర్ప్ గైడ్లెన్స్ ప్రకారం సొంత గ్రామాల్లో,పూర్వ క్లస్టర్ లో సిసిలకు ఉద్యోగ బాధ్యతలు ఇవ్వొద్దని తెలుస్తోంది. అయిన నిబంధనలకు విరుద్ధంగా కొన్ని గ్రామాల్లో జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్ ఉన్నతాధికారుల నుంచి గ్రామ స్థాయి అధికారుల్లో జీరో కౌన్సెలింగ్ చేపట్టిన నేపథ్యంలో అధికారులు ట్రాన్స్ పర్ అయ్యారు. కానీ జిల్లా కేంద్రంలో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న డిపిఎం కు మాత్రం ట్రాన్స్ పర్ కాకపోవడం విచారకరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -