నవతెలంగాణ – ఆర్మూర్
గత 18 సంవత్సరాలు గా డిగ్రీ స్థాయి నుండే సమాజానికి నా వంతు వ్యక్తి గత ఖర్చుతో సేవలు చేస్తున్నానని పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి పట్వారి సోమవారం తెలిపారు. వివేకానందుని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూమాట్లాడినారు సమాజ శ్రేయస్సు, వచ్చే విద్యార్థి లోకానికి యువతరం కి స్పూరదాయకం కోసం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ముఖ్యంగా స్టడీ మెటీరియల్, పరీక్ష ప్యాడ్స్, స్టేషనరీ వస్తువులు అందజేసినట్టు తెలిపారు.
వృద్ధులకు చలికాలంలో దుప్పట్లు , రోడ్డు మార్గంలో ప్రమాదం జరిగే ప్రాంతంలో ఉచితంగా హెల్మెట్లు , వేసవి కాలంలో ఉచితంగా చలివేంద్రం , దేవాలయం లకు కుర్చీలు, కోవిడ్ సమయాలలో 3000 మాస్క్లు, శానిటజర్స్, పోలీస్ శాఖ కి జ్యూస్, వాటర్ పంపిణీ , మున్సిపల్, ప్రజలకు కోవిడ్ సమయాలలో సేవలు అందించినట్టు తెలిపారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పేషంట్ లకు మెడిసిన్ కిట్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయం లో మొక్కలు నాటడం,పంపిణీ, మెరిట్ విద్యార్థులు కు ప్రోత్సాహం ఇవ్వాలని వారి నివాసానికి వెళ్లి ప్రోత్సాహక సన్మానం చేసి జ్ఞాపికను ఇవ్వడం జరిగిందని తెలిపారు.
పట్టణ గ్రంథాలయానికి పుస్తకాలు, పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారికి పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం, పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో మండలంలోని లాలన ఆశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ, వాకర్ స్టాండ్స్ ఉచితంగా పంపిణీ ,డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు యువత బానిస కాకుండా నివారణ కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల లో ఆశ్రమంలో డాక్టర్లు సహకారం తో హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయడం, మూగ చెవిటి పాఠశాల లో, అనాథ ఆశ్రమాలకు అవసరం అయ్యే సామాగ్రి అందజేయడం
వివేకానంద జయంతి, వివిధ మహనీయుల జీవిత చరిత్ర ను విద్యార్థులుకు తేలియజేస్తూ జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయడం, సమయం అనుసరంగ సరైన సమయంలో స్పందించి , పట్టణ ప్రజలుకు , గ్రామీణ ప్రాంతాలకు నా వంతు సేవలు ఎల్లప్పుడూ అందిస్తున్నానని తెలిపాడు. నిస్వార్థ నిర్విరామంగా చేసే సమాజ సేవలకు పుడమి రత్న జాతీయ సేవ సంస్థ ఖమ్మం వారు 2024 డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్రం నుండి భారత సేవా రత్న జాతీయ అవార్డు తో బిరుదు అందజేసి గౌరవించినట్టు తెలిపారు.
వివేకానందుడు ఒక శక్తి గా దేశానికి సేవలు అందించారని, నేటి యువతరం విద్యార్థులు విద్యార్థి దశ నుంచి మంచి అలవాట్లతో గొప్ప ఆలోచనలో ఉంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లి సమాజానికి దేశానికి ఆదర్శంగా నిలిచి మహా వ్యక్తి గా మారాలని కోరారు. ప్రతీ ఒక్కరూ నేను చేసే సేవలను చూస్తూ ఉండడం కాదు మీరు కూడా పది మంది కి ఉపయోగ పడేలా ముందుకు వెళ్లి సమాజానికి తన వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఒకరికి స్పూర్తి గా నిలవాలి నేటి యువతరం జీవనశైలి అని అన్నారు.



