Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంట్రంప్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ

ట్రంప్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -
  • హార్వర్డ్‌కు నిలిపివేసిన నిధులను ఇవ్వాలని ఫెడరల్‌ కోర్టు ఆదేశం
    వైట్‌హౌస్‌: హార్వర్డ్‌ నిధుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. యూనివర్సిటీకి అందించే 2.6 బిలియన్‌ డాలర్ల నిధుల నిలిపివేస్తూ ట్రంప్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఫెడరల్‌ కోర్టు ఆదేశించింది. హార్వర్డ్‌ తన పాలన విధానాల్లో మార్పు కోసం వైట్‌హౌస్‌ చేసిన డిమాండ్లను తిరస్కరించినందుకు ట్రంప్‌ సర్కార్‌ తీసుకున్న ప్రతీకార చర్య అని తీర్పునిచ్చింది. యూనివర్సిటీలో యూదులపై వ్యతిరేకత విషయానికి ఈ నిధుల కోతకు సంబంధం లేదని పేర్కొంది. ఫెడరల్‌ నిధులను నిలిపివేయడాన్ని సమర్థించేందుకు యూదులపై వ్యతిరేకతను కవచంగా వాడారని తెలిపింది. ఇది స్పష్టమైన రాజకీయ ప్రతీకారమని వెల్లడించింది. ఈ తీర్పుతో హార్వర్డ్‌కు గణనీయమైన విజయం లభించింది. కోతల కారణంగా నిలిచిన వందలాది రీసెర్చ్‌ ప్రాజెక్టులకు పునర్జీవం లభించనుంది.హార్వర్డ్‌ యూనివర్సిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని, ఫేస్‌ మాస్క్‌లను నిషేధించాలని ట్రంప్‌ నేతృత్వంలోని పరిపాలన విభాగం ఓ లేఖను పంపించింది. పాలస్తీనా అనుకూల నిరసనలను అణచివేసేందుకు ఈ నిబంధనలను జారీ చేసినట్టుగా సమాచారం. దీనిపై స్పందించిన హార్వర్డ్‌ విశ్వవిద్యాయలయం ప్రెసిడెంట్‌ అలాన్‌ గార్బర్‌ ఆ డిమాండ్లను వ్యతిరేకిస్తున్నట్టు బదులిచ్చారు. ఏ ప్రభుత్వమైనా విశ్వవిద్యాలయాల్లో ఏం బోధించాలి, ఎవరిని చేర్చుకోవాలి, నియమించుకోవాలి లేదా ఏ రంగాలను ఎంచుకోవాలో నిర్దేశించకూడదని తెలిపారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్‌ ప్రభుత్వం, హార్వర్డ్‌కు అందే నిధులను స్తంభింపజేయాలని నిర్ణయించింది. పౌర హక్కులను ఉల్లంఘించారనే ఇప్పటికే కొలంబియా, పెన్సిల్వేనియాతో సహా కార్నెల్‌, నార్త్‌ వెస్ట్రన్‌ విశ్వవిద్యాలయాలకు అందించే నిధులను ట్రంప్‌ సర్కార్‌ నిలిపివేసింది.ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం నుంచి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై నిషేధం విధించింది. ట్రంప్‌ సర్కారు నిర్ణయం తర్వాత హార్వర్డ్‌ ఇకపై కొత్త విదేశీ విద్యార్థులను అడ్మిషన్లు ఉండవు. ఇప్పటికే యూనివర్సిటీలో చదవుతున్న విదేశీ విద్యార్థులు మరొక విశ్వవిద్యాలయానికి బదిలీ కావాల్సి ఉంటుంది. లేకపోతే అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది చేయకపోయినా చట్టపరమైన చర్యలు ఉంటాయని ట్రంప్‌ సర్కార్‌ హెచ్చరించారు.
    140 కంటే ఎక్కువ దేశాల నుంచి
    అమెరికాలోని పురాతన, సంపన్న విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్‌ఒకటి. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో 140 కంటే ఎక్కువ దేశాల నుంచి ఏటా అడ్మిషన్లు పొందుతున్నారు. ఒక్క మసాచుసెట్స్‌లోని హార్వర్డ్‌ కేంబ్రిడ్జ్‌ క్యాంపస్‌లోనే దాదాపు 6,800 మంది విదేశీ విద్యార్థులు చేరుతున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్‌ విద్యార్థులే.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad