Thursday, July 31, 2025
E-PAPER
Homeఆటలుహెచ్‌సీఏ సెలక్షన్‌ కమిటీలు ఏర్పాటు

హెచ్‌సీఏ సెలక్షన్‌ కమిటీలు ఏర్పాటు

- Advertisement -

జస్టిస్‌ నవీన్‌ రావు ఆదేశాలతో నియామకం
హైదరాబాద్‌ :
హైకోర్టు నియమించిన జస్టిస్‌ (విశ్రాంత) పి. నవీన్‌ రావు ఏక సభ్య కమిటీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో సీనియర్‌, జూనియర్‌ సెలక్షన్‌ కమిటీలు నియమించారు. హెచ్‌సీఏ ఆఫీస్‌ బేరర్లలో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి సహా మాజీ సీఈవో సిఐడి కేసులో జైలు కెళ్లగా.. తాత్కాలిక అధ్యక్షుడు సర్దార్‌ దల్జీత్‌ సింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు ఏసిన ఏజీఎంపై ఓ క్లబ్‌ కార్యదర్శి హైకోర్టులో సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ డివిజన్‌ లీగ్‌ మ్యాచులను పర్యవేక్షిస్తున్న జస్టిస్‌ నవీన్‌ రావును ఏక సభ్య కమిటీగా హైకోర్టు నియమించటంతో.. క్రికెట్‌ వ్యవహారాలు, పరిపాలన ఇప్పుడు మళ్లీ గాడిలో పడుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సీనియర్‌, జూనియర్‌ మెన్‌ సెలక్షన్‌ కమిటీలను నియమించారు. మెన్స్‌ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌గా పరువు హరిమోహన్‌ ఎంపిక కాగా.. జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌గా సుదీప్‌ త్యాగి ఎంపికయ్యారు. ఈ మేరకు హెచ్‌సీఏ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ : పరువు హరి మోహన్‌ (చైర్మెన్‌), నరేంద్ర పాల్‌ సింగ్‌, ఆకాశ్‌ భండారి, షేక్‌ రియాజుద్దీన్‌, జ్యోతి శెట్టి
జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ : సుదీప్‌ త్యాగి (చైర్మెన్‌), హబీబ్‌ అహ్మద్‌ ఖాన్‌, సుదీప్‌ రాజన్‌, అరవింద్‌ శెట్టి, అన్వర్‌ అహ్మద్‌ ఖాన్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -