సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇన్చార్జ్ డి ఎం హెచ్ ఓ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – కామారెడ్డి
బాన్గువాడ పట్టణంలో 7 హిల్స్ హాస్పిటల్ను గత (20) రోజుల క్రితం డిప్యూటి డి ఎం హెచ్ ఓ సీజ్ చేశారు. అయినప్పటికీ ఆస్పత్రి యధావిధిగా కొనసాగుతోంది. దానిని శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ శనివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసినట్లు సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన మైనర్ 16 సంవత్సరాల బాలుడు అగు భానుప్రసాద్ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో డిప్యూటి డిఎంహెచ్ఓ వచ్చి 7 హిల్స్ హాస్సిటల్ ను సీజ్ చేయడం జరిగింది. తీరా మళ్లీ చూస్తే మళ్ళీ యధావిధంగా ఆ ఆస్పత్రిని నడిపిస్తున్నారు.
ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న 7 హిల్స్ హాస్పిటల్ ను శాశ్వతంగా మూసివేయుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చిన్న సమన్య కొరకు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొండుతూ.. డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం బలిఅయినది. ఇట్టి విషయంలో కుటుంబ సభ్యులు బంధువులు అందోళన చేయడంతో డిప్యూటీ డి.యండ్ హెచ్ ఓ వచ్చి 7 హిల్స్ హాస్పిటల్ ను సీజ్ చేయడం జరిగింది. ఈ ఆస్పత్రిలో ప్రజలు చిన్న ఆరోగ్య సమస్య కొరకు వెళ్లినా.. డాక్టర్లు పెద్ద ఆరోగ్య సమస్యగా చిత్రీకరిస్తూ.. ప్రజలనుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఇంకా సమస్య ఉంటే నిజామాబాద్ లోని మనోరమ ఆస్పత్రికి రిఫర్ చేస్తు వారి నుండి కమీషన్లు తీసుకుంటున్నారు.
7 హీల్స్ ఆస్పత్రిలో పని చేసే ప్రతి డాక్టర్ కు సరైన అర్హత లేదు. అర్థోపెడిక్ డాక్టర్ల వద్ద జానియర్ గా పని చేసి ఇక్కడ స్వంతంగా పని చేయుచున్నారు. ఈ ఆస్పత్రిని మళ్ళీ ప్రారంభించారు. కావున తమరు పై విషయాలను పరిశీలించి, ఈ ఆన్పత్రిలో పని చేయుచున్న డాక్టర్లపై, యాజమాన్యంపై చట్టరీత్య తగు చర్యలు తీసుకొని సదరు 7 హిల్స్ ఆస్పత్రిని శాశ్వతంగా మూసి వేయుటకు అదేశాలు జారీ చేయాలని వినతి పత్రంలో కోరమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు జె.రవీందర్, ఎండి ఖాజా, తదితరులు పాల్గొన్నారు.
సెవెన్ హిల్స్ ఆస్పత్రిని శాశ్వతంగా మూసివేయాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES