నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో మృతి చెందిన ఓలాద్రి రామ్ రెడ్డి మృతి చెందగా ఆ కుటుంబాన్ని సందర్శించి పరమాశించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ వలబోజు వలబోజు వెంకటేశ్వర్లు తో కలిసి మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఓలాద్రి రామ్ రెడ్డి మృతి గ్రామానికి తీరనిలోటు అని అన్నారు. తను ఎంతో మందికి సహకారాలు అందించి ఎంతో మందిని ఆదుకున్నాడని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణించడం చాలా బాధాకరమని అన్నారు. మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మదనతుర్తి మాజీ సర్పంచ్ వలబోజు వెంకటేశ్వర్లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిట్టల మురళి,నాయకులు నలమాస రామచంద్రు, పెరుమాళ్ళ శ్రీధర్, ఒరే అశోక్, జెల్ల మురళి ,దర్శనం ప్రశాంత్ యాకూబ్ పాషా, మై బెల్లీ , జిల్లెల్ల సతీష్ ఏర్పుల రాములు,తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఏదేళ్ళ యాదవ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES