- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీంతో శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇక్కడి నుంచి ఢిల్లీ, మధురై, బెంగళూరు, గోవా, కోల్‌కతా, భువనేశ్వర్ వెళ్లాల్సిన కొన్ని విమానాలు రద్దయ్యాయి. గోవా, అహ్మదాబాద్, మదురై, బెంగళూరు, ఢిల్లీ, భువనేశ్వర్, చెన్నై నుంచి శంషాబాద్‌కు రావాల్సిన విమానాలు కూడా రద్దయినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌లైన్స్ ఆపరేషనల్ ఇష్యూస్ కారణంగా విమానాలు రద్దయినట్లు వెల్లడించారు.
- Advertisement -



