Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంలైంగికదాడి కేసు.. ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు

లైంగికదాడి కేసు.. ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జేడీఎస్ అధినేత దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు శనివారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. మైసూర్‌లోని కేఆర్ నగర్‌లో ఓ మహిళపై లైంగికదాడి చేసిన ఘటనలో శుక్రవారం కర్ణాటక ప్రజా ప్రతినిధుల ప్రత్యేక ధర్మాసనం ఆయన్ను దోషిగా తేలిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
అసలు ఏంటీ కేసు?
కేఆర్‌ నగరకు చెందిన మహిళ 2024 ఏప్రిల్‌ 28న హొళెనరసీపుర ఠాణాలో ప్రజ్వన్‌ రేవణ్ణపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసింది. గన్నిగడ ఫాంహౌస్‌లో తనపై లైంగికదాడి జరిగిందని బాధితురాలు (47) తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మరికొన్ని లైంగికదాడి కేసులు ప్రజ్వల్‌పై నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా 14 నెలలుగా ప్రజ్వల్‌ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా తాజాగా శిక్ష ఖరారైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -