నవతెలంగాణ హైదరాబాద్: స్కూల్‌లో మైనర్ బాలుడిపై దారుణం జరిగింది. వాష్‌రూమ్స్‌లోకి వెళ్లిన 14 ఏండ్ల బాలుడిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 24న సెంట్రల్ ఢిల్లీలోని ఓ స్కూల్ వాష్‌రూమ్‌లోకి వెళ్లిన బాలుడిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని బాలుడు అదేరోజు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దాంతో వెంటనే పోలీస్ టీమ్ స్కూల్‌కు వెళ్లి ఎంక్వయిరీ మొదలుపెట్టింది. ఇంతలో బాలుడి పేరెంట్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. స్కూల్‌కు వెళ్లిన పోలీస్ టీమ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.డాక్టర్ నుంచి మెడికో-లీగల్ సర్టిఫికెట్ అందిన తర్వాత పోలీసులు ఆ బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఢిల్లీలో మైనర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సగటున రోజుకు ఐదుగురు వ్యక్తులు అరెస్టవుతున్నారు. ప్రతిరోజు దాదాపు నాలుగు కేసులు పోక్సో చట్టం కింద నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు పిల్లలపై జరుగుతున్న నేరాల తీవ్రతను తెలియజేస్తున్నాయి.