నవతెలంగాణ – భువనగిరి
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పాఠశాలల ఖోఖో పోటీలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో జట్టు బుధవారం సికింద్రాబాద్ నుండి ప్రయాణమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ క్రీడాకారులను కలిసి క్రీడా దుస్తులు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ.. పాఠశాల క్రీడాకారులు రాష్ట్ర విద్యాశాఖకు మంచి పేరు తేవాలని కోరారు ఆటలతో పాటు క్రమశిక్షణతో మెలిసి భవిష్యత్తులో ప్రభుత్వం కల్పించిన స్పోర్ట్స్ కోటాను ఉపయోగించుకోవాలని కోరారు. ఎస్ జి ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కందాడి దశరథ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి పొన్నగాని కృష్ణమూర్తి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలుర కోచ్ వినోద్, మేనేజర్ వెంకటేష్, బాలికల కోచ్ శ్రీనివాస్, మేనేజర్ సత్యవతి, క్రీడాకారుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు ఎస్జిఎఫ్ తెలంగాణ ఖోఖో జట్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



