Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్జిటియు 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

ఎస్జిటియు 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్ 
ప్రాథమిక పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని ఎస్జిటియు మండల ప్రధాన కార్యదర్శి ఎస్. నరసింహా అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో రాయపోల్ మండల తహసిల్దార్ కృష్ణమోహన్, ఎస్ఐ కుంచం మానస ల చేతిలో మీదుగా ఎస్జిటియు 2026 – క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయులు, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా నియమించాలన్నారు. పాఠశాలలలో ఎక్కువ ఆన్ లైన్ వర్క్ ఉండడం వలన బోధనకు ఇబ్బంది కలుగుతుందన్నారు. కావున ప్రతి పాఠశాలలలో ఒకరు డేటా ఆపరేటర్ ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే ఉపాధ్యాయులందరికి ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని , పిఆర్సి వెంటనే జనవరిలో ప్రకటించాలని, డిఎ, పెండింగ్ బిల్లులు వెంటనే జనవరిలో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రాజేశం, సీనియర్ అసిస్టెంట్ నాగరాజు, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -