నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పట్టణంలోని ఖిలా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కేకే మెడికల్ హాల్‌ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ..ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.పట్టణ వాసులకు అవసరమైన అన్ని రకాల మందులు ఒకే చోట అందించే విధంగా ఈ మెడికల్ హాల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన తెలిపారువైద్య రంగంలో సేవాభావంతో ముందుకు వచ్చే వారు సమాజానికి ఎంతో మేలు చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు, వ్యాపారవేత్తలు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మెడికల్ హాల్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రజలకు సరసమైన ధరలకు మందులు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కేకే మెడికల్ హాల్‌ను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



