- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీ తెలిపారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ, 13వ, 1వ వార్డుల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధే మా అజెండా అని, ప్రజల కష్టసుఖాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని నిరూపిస్తూ కామారెడ్డి రూపురేఖలు మార్చుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



