- Advertisement -
నవతెలంగాణ – ఊరుకొండ
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని.. ప్రతి మహిళ షీ టీమ్స్ పై అవగాహన కలిగి ఉండాలని సీఐ నాగార్జున అన్నారు. మంగళవారం ఊరుకొండ మండల పరిధిలోని ఉరుకొండపేట గ్రామ శివారులో గల సూర్యలత స్పిన్నింగ్ కాటన్ మిల్లులో స్వీట్ డ్రీమ్స్ వారి ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సిసిఎస్ సీఐ శంకర్, ఎస్సై కృష్ణదేవ, సైబర్ క్రైమ్ ఎస్ఐ రమాదేవి, రజిత, మానవ అక్రమ రవాణా సిబ్బంది ఏఎస్ఐ జానకి రాములు, సిబ్బంది వెంకట్ రాములు, వెంకటయ్య గౌడ్, వెంకటస్వామి, పద్మ, ఊరుకొండ పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



