Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeసినిమామహిళా శక్తిని చాటి చెప్పే శీలావతి

మహిళా శక్తిని చాటి చెప్పే శీలావతి

- Advertisement -

ప్రతి మహిళ సింపుల్‌గా, సున్నితంగా కనిపిస్తున్నప్పటికీ ఏదైన ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఓ బలమైన పిల్లర్‌లా నిలబడుతుంది. మహిళల్లో ఉండే గొప్ప క్వాలిటీ అది. దర్శకుడు క్రిష్‌ అలాంటి ఒక బలమైన శీలావతి పాత్రని తీర్చి దిద్దారు’ అని నాయిక అనుష్క శెట్టి అన్నారు.
అనుష్క శెట్టి నటించిన కంప్లీట్‌ యాక్షన్‌ డ్రామా ‘ఘాటి’. ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.
యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్ల మూడి నిర్మించారు. ఈనెల 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో నాయిక అనుష్క శెట్టి మీడియాతో ముచ్చటించారు.

మీ సినీ ప్రస్థానంలో ఇది 20వ సంవత్సరం. ఇలాంటి సందర్భంలో ‘ఘాటి’ లాంటి యాక్షన్‌ అడ్వెంచర్‌ చేయడాన్ని ఎలా ఫీల్‌ అవుతున్నారు?
చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఇందులో చేసిన శీలావతి అమేజింగ్‌ క్యారెక్టర్‌. ఇలాంటి క్యారెక్టర్‌ని నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. చాలా బ్యూటీఫుల్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌. కంఫర్ట్‌ జోన్‌ని దాటి చేసిన సినిమా ఇది. ‘అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి’.. ఈ సినిమాలన్నింటిలోనూ చాలా బలమైన పాత్రలు చేశాను. అంతే బలంగా ఉన్న క్యారెక్టర్‌ శీలావతి. నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచి పోయే పాత్ర.

ఈ కథ విన్నప్పుడు మీ రియాక్షన్‌ ఏమిటి?
క్రిష్‌ ఈ కథ చెప్పినప్పుడు బ్యాక్‌డ్రాప్‌ తాలుకా ఆ కల్చర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
లొకేషన్స్‌కి వెళ్ళిన తర్వాత ఒక కొత్త క్యారెక్టర్‌, కల్చర్‌, ఒక కొత్త విజువల్‌ని ఆడియన్స్‌కి చూపించబోతున్నా మనే నమ్మకం కలిగింది.

ఇందులో గంజాయి ఎలిమెంట్‌ ఉంది కదా.. అది ఎలాంటి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తుంది?
క్రిష్‌ ఎప్పుడు కూడా సోషల్‌గా రెలెవెంట్‌ ఉండే కథలనే ఎంచుకుంటారు. సొసైటీలో ఉండే సీరియస్‌ ఇష్యూ ఇది. మేము ఈ సినిమాని యాక్షన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గానే తీసాం. అయితే ఈ కథలోనే ఓ చక్కని పాజిటివ్‌ సందేశం కూడా ఉంది.

‘వేదం’ తర్వాత క్రిష్‌తో చేసిన ఈ సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలను రీచ్‌ అవుతారా?
కచ్చితంగా. ‘వేదం’లో సరోజ పాత్రకి కొనసాగింపుగా ఒక సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ ఆర్గానిక్‌గా ఏదైనా ఒక కథ వస్తే బాగుంటుందని ఎదురు చూశాం. అలాంటి సమయంలో ‘ఘాటి’ లాంటి అద్భుతమైన కథ కుదిరింది. క్రిష్‌ నాకు ఎప్పుడు కూడా చాలా అద్భుతమైన పాత్రలు ఇస్తున్నారు. ఈ విషయంలో ఆయనకి కతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఘాటీ నిర్మాతల గురించి?

రాజీవ్‌ రెడ్డికి, యువి క్రియేషన్స్‌కి థ్యాంక్స్‌ చెప్పాలి. ఇలాంటి ఒక డిఫరెంట్‌ సబ్జెక్ట్‌ని బిలీవ్‌ చేసి, నాపై నమ్మకం ఉంచి, ఇంత గ్రాండ్‌ స్కేల్లో సినిమా చేసి నందుకు వారికి కతజ్ఞతలు.

కొత్త సినిమాల అప్‌డేట్‌ ఏంటి?
మంచి లైన్‌ అప్‌ ఉంది. నా ఫస్ట్‌ మలయాళం ఫిల్మ్‌ త్వరలోనే రాబోతోంది. తెలుగులో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది. అది కూడా చాలా సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఇంకా చాలా కథలు విన్నాను. వాటిల్లో ఏది ఫైనలైజ్‌ చేశాననేది త్వరలో చెబుతా.

మీరు ఇంకా చేయాలనుకునే క్యారెక్టర్‌ ఏదైనా ఉందా?
అవుట్‌ అండ్‌ అవుట్‌ నెగటివ్‌ క్యారెక్టర్‌ చేయాలని ఉంది. ఒక బలమైన క్యారెక్టర్‌ కుదిరితే కచ్చితంగా నెగటివ్‌ రోల్‌ చేస్తాను.
– అనుష్క

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad