Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్షిర్డీ సాయిబాబా ఆలయంలో శిఖర కలశ స్థాపన మహోత్సవం.!

షిర్డీ సాయిబాబా ఆలయంలో శిఖర కలశ స్థాపన మహోత్సవం.!

- Advertisement -

హాజరుకానున్న స్వామి కాశికానంద్‌జీ మహారాజ్..
నవతెలంగాణ – మల్హర్ రావు

భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ఈ నెల 27న ఆదివారం రోజున శిఖర కలశ ప్రతిష్ఠాపనోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. శిఖర ప్రతిష్టాపన కార్యక్రమానికి షిర్డీ నుండి ఆధ్యాత్మిక గురువు స్వామి కాశికానంద్‌జీ మహారాజ్ హాజరై శిఖర కలశ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ మాజీ సభ్యులు శ్రీ మహేంద్ర గణపతి రావు షెల్కే పాటిల్, వారి సతీమణి శ్రీమతి సురేఖ మహేంద్ర షెల్కే పాటిల్ రానున్నారు. అనంతరం షిర్డీ నుండి వచ్చిన ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ స్వామి కాశికానంద్‌జీ మహారాజ్ ఆధ్వర్యంలో ఆ సాయినాధుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయనున్నారు. శిఖర కలశ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి  సాయిబాబా భక్తులు అధిక సంఖ్యలో తరలి రానుండడంతో  గ్రామస్తులు, నిర్వాహకులు భక్తుల సౌకర్యాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శిఖర కలశ ప్రతిష్టాపన కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -