Friday, March 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా

తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా

- Advertisement -

మహారాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ నియామకం

హైదరాబాద్‌: తెలంగాణ నూతన గవర్నర్‌గా ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా వ్యవహరిస్తోన్న శివప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుత తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. నాగాలాండ్‌ గవర్నర్‌గా నంద్‌కిశోర్‌ యాదవ్‌, బిహార్‌ గవర్నర్‌గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ సయ్యద్‌ అటా హస్నైన్‌ను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -