Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెస్ పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపికైన శివ చరణ్

చెస్ పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపికైన శివ చరణ్

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
భువనగిరిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్ 17 చెస్ ఛాంపియన్ పోటీలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బఖల్ వాడి క చెందిన పదవ తరగతి చదువుతున్న శివ చరణ్ రాష్ట్రస్థాయి చాంపియన్స్ కు ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికైనారు. పాఠశాలలో బుధవారం ఆ క్రీడాకారునికి ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి విద్య తో  పాటు క్రీడల యందు ఆసక్తి కనబరచాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాల స్థాయిలో చదివిన విద్యార్థులు ప్రతిభను  కనబరుస్తున్నారని తెలిపారు. విద్యతోపాటు క్రీడలలలో విద్యార్థులు రాణించాలని సూచించారు. ముఖ్యంగా బాలికలు కూడా క్రీడల పట్ల ఆసక్తిని కనపరిచి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని కోరారు.అనంతరం గోల్డ్ మెడల్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్స్  నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పంగ సైదులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -