షాద్ నగర్ డివిజన్ టిడబ్ల్యూజేఎఫ్ డిమాండ్..
షాద్ నగర్ లో సొంత ఖర్చుతో ఏర్పాటుకు కృషి చేస్తా: సీనియర్ జర్నలిస్ట్ ఖాజా పాషా కేపీ..
టిడబ్ల్యూజేఎఫ్ షాద్నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ కు ఘన నివాళులు..
షోయబుల్లాఖాన్ ధైర్య సాహసాలతో ముందుకు కదులుదాం..
డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర గౌడ్, నరేష్…
నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్
నిజాం రజాకారుల ఆకృత్యాలు విధ్వంశాలపై అక్షర పోరాటం చేసి తన ప్రాణాలను పోగొట్టుకున్న మహనీయుడు, జర్నలిస్టులకు ఆదర్శ ప్రాయుడైన షోయబుల్లాఖాన్ విగ్రహాన్ని ట్యాంకుబండు పై ఏర్పాటు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సీనియర్ నాయకులు జర్నలిస్ట్ ఖాజా పాషా కెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షాద్ నగర్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ నిప్పు కనo, అక్షర యోధుడు, జర్నలిస్టు షోయబుల్లాఖాన్ 77వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పట్టణ ముఖ్య కూడలిలో షోయబుల్లాఖాన్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజెఎఫ్ సీనియర్ నాయకులు ఖాజా పాషా కెపి, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్ గౌడ్, నరేష్, , కస్తూరి రంగనాథ్, నర్సింహారెడ్డి తదితరులు మాట్లాడుతూ.. నిజాం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని, రజాకార్ల ఆకృత్యాలను వ్యతిరేకిస్తూ వారిపై అక్షర పోరాటం చేసిన షోయబుల్లాఖాన్ జర్నలిస్టులకు ఆదర్శమని ప్రశంసించారు.
అలాంటి మహనీయుడికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. చరిత్రలో గుర్తుంచుకోవలసిన జర్నలిస్టులు కొందరే ఉన్నారని అలాంటి వారిలో షోయబుల్లాఖాన్ ముందువరుసలో ఉంటారని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా ప్రతి జర్నలిస్టు నిజాయితీగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిజాం నిరంకుశత్వం నుంచి ప్రజలను కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించిన షోయబుల్లాఖాన్ ను చరిత్రను ప్రభుత్వాలు విస్మరించాలని అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరు ఉనికి పుచ్చుకొని అక్షర సత్యాలను వెలుగులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు .
షాద్ నగర్ లో షోయబుల్లాఖాన్ విగ్రహాన్ని సొంత ఖర్చులతో ఏర్పాటకు కృషి చేస్తా: ఖాజా పాషా కేపీ…
షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో అక్షర వీరుడు తెలంగాణ నిప్పురవ్వ షోయబుల్లాఖాన్ విగ్రహాన్ని సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని సీనియర్ జర్నలిస్టు వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు ఖాజా పాషా కెపి ప్రకటించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్థలాన్ని కేటాయిస్తే తన సొంత ఖర్చుతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నిజాం పోరాట యోధుడు, జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ లాంటి మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అక్షర రచనలు ఆయన ధైర్య సాహసాలను చాటి చెప్పేందుకు కృషి చేద్దామని అన్నారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు షోయబుల్లాఖాన్ విగ్రహం ఏర్పాటు కు కృషి చేస్తానని ఖాజ పాషా కెపి ప్రకటించడం పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు లక్కాకుల రమేష్ కుమార్, కస్తూరి రంగనాథ్, నరసింహారెడ్డి, అప్సర్, సురేష్, రాకేష్, సాయినాథ్ రెడ్డి, కృష్ణ, జగన్, మహేష్, బాలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.