- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరో షాక్ తగిలింది. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. రూ.2,929.05 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ చర్యలు చేపట్టింది. ముంబైలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్), దాని డైరెక్టర్ అనిల్ అంబానీ, ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
- Advertisement -