Monday, December 15, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలోని బ్రౌన్‌ వర్సిటీ వద్ద కాల్పులు

అమెరికాలోని బ్రౌన్‌ వర్సిటీ వద్ద కాల్పులు

- Advertisement -

ఇద్దరు మృతి, మరో 8మందికి తీవ్రగాయాలు
న్యూయార్క్‌: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం సృష్టించాయి. బ్రౌన్‌ విశ్వవిద్యాలయం రోడ్‌ ఐలాండ్‌లోని ‘బారస్‌ అండ్‌ హౌలీ ఇంజినీరింగ్‌ భవనంలో జరిగిన కాల్పుల్లో క్యాంపస్‌లో పరీక్ష జరుగుతుండగా దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. దుండగుడి కోసం ఆరా తీస్తున్నట్టు మేయర్‌ వెల్లడించారు. ఫోన్లను సైలెంట్‌గా ఉంచుకోవాలని, డోర్లను లాక్‌ చేసుకోవాలని విద్యార్థులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు తెలిపారు. అయితే కాల్పులు జరిగిన వ్యక్తి నల్లటి దుస్తులు ధరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు బ్రౌన్‌ యూనివర్సిటీ భవనంలోకి ఎలా ప్రవేశించాడనే అంశంపై విచారణ కొనసాగుతోందని అన్నారు. అయితే అతడు హౌప్‌ స్ట్రీట్‌ వైపు నుంచి బయటకు వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్టు మేయర్‌ బ్రెట్‌ స్మైలీని తెలిపారు.అయితే ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికాలో 70కి పైగా పాఠశాల కాల్పుల ఘటనలు జరిగాయి.

స్పందించిన ట్రంప్‌
ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ‘రోడ్‌ ఐలాండ్‌లోని బ్రౌన్‌ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటన గురించి నాకు సమాచారం అందింది. ఎఫ్‌బీఐ ఘటనా స్థలంలో ఉంది. అనుమానితుడు అదుపులో ఉన్నాడు. బాధితులకు మృతుల కుటుంబాలను దేవుడు ఆశీర్వదించుగాక’ అని తన సొంత సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్ట్‌ చేశారు. అయితే కొద్ది సేపటికే ట్వీట్‌ను వెనక్కి తీసుకున్నారు. నిందితుడుని ఇంకా పట్టుకోలేదని తెలిపారు.ఇటీవల అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు కలకలం రేగాయి. ఓ దుండుగుడు నేషనల్‌ గార్డ్‌లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్‌ గార్డ్‌లు ప్రాణాలు విడిచినట్టు వెస్ట్‌ వర్జీనియా గవర్నర్‌ పాట్రిక్‌ మొరిసె సోషల్‌ మీడియాలో ప్రకటించారు. కాల్పులు జరిగిన వెంటనే సమీపంలో ఉన్న ఇతర నేషనల్‌ గార్డ్‌ సభ్యులు అలర్ట్‌ అయ్యారు. వెంటనే కాల్పులు జరిగిన ప్రదేశంలోకి పరుగెత్తుకు వచ్చి, కాల్పులు జరిపిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -