Thursday, January 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులా అధ్యక్ష భవనం వద్ద కాల్పులు

వెనిజులా అధ్యక్ష భవనం వద్ద కాల్పులు

- Advertisement -

గగనతలంలో చక్కర్లు కొట్టిన డ్రోన్లు
కారకాస్‌ :
వెనిజులా అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ సమీపంలో సోమవారం కాల్పుల మోతలు వినిపించాయి. ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
అధ్యక్ష భవనం పైన డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. దేశాధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా దళాలు అపహరించుకొని వెళ్లిన తర్వాత రాజధాని కారకాస్‌లో ఉద్రిక్తత నెలకొన్నదని మీడియా వార్తలు ద్వారా తెలుస్తోంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉన్నదని అధికారులు తెలిపారు. వెనిజులా ఘటనలతో తనకేమీ సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పింది. అధ్యక్ష భవనం సమీపంలో ఉన్న భద్రతా దళాల మధ్య అవగాహనా లోపం కారణంగా కాల్పులు జరిగి ఉండవచ్చునని సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ తెలియజేసింది. అయితే దీనిని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగుయెజ్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటలకే కాల్పుల మోతలు విన్పించాయి. ఘర్షణలు జరిగాయి.
గుర్తు తెలియని డ్రోన్లు అధ్యక్ష భవనంపై ఎగిరాయని ఎఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. దీంతో భద్రతా దళాలు వాటి పైకి కాల్పులు జరిపారని చెప్పింది. ఇదిలావుండగా రోడ్రిగుయెజ్‌ సోదరుడు జార్జ్‌ రోడ్రిగుయెజ్‌ నేషనల్‌ అసెంబ్లీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు.

మదురో తరఫున బెర్రీ పొల్లాక్‌ వాదనలు
సుదీర్ఘ కాలం న్యాయ పోరాటం చేసి జులియన్‌ అస్సాంజేను జైలు నుంచి విడిపించిన న్యాయవాది బెర్రీ పొల్లాక్‌ ఇప్పుడు మదురో తరఫున వాదనలు వినిపించబోతున్నారు. దీనిపై దౌత్య, న్యాయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కేసులు వాదించిన చరిత్ర ఆయనకు ఉంది. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు అస్సాంజేకు ఆయన రక్షణ కవచంలా నిలిచారు.

మేము తప్పు చేయలేదు : మదురో దంపతులు
అమెరికా అధీనంలో ఉన్న మదురో దంపతులను న్యూయార్క్‌ కోర్టులో హాజరు పరచగా తామేమీ తప్పు చేయలేదని తెలిపారు. ‘నేను అమాయకుడిని. గౌరవనీయ వ్యక్తిని. నేను ఇప్పటికీ నా దేశానికి అధ్యక్షుడిని’ అని మదురో చెప్పారు. అనంతరం కేసు విచారణను న్యాయమూర్తి మార్చి 17వ తేదీకి వాయిదా వేశారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం వెలుపల మదురో అనుకూల, వ్యతిరేక ప్రదర్శకులు గుమిగూడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -