నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో మోడీ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తుంది. ఆపరేషన్ కగార్ పేరుతో అనేక మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతం చేస్తున్నాయి. తాజాగా ఝార్ఖండ్‌లో పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలోని గోయిల్ కేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సారండా అడవి లో ఎన్ కౌంటర్ జరిగింది.ఈ కాల్పులలో ఒక మావోయిస్టు మృతి చెందాడని అధికారులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అమిత్ హస్దా అలియాస్ ఆప్తాన్ ను మట్టుబెట్టాయని పోలీస్ సూపరింటెండెంట్ పరాస్ రాణా తెలిపారు. మరణించిన మావోయిస్టుపై రూ.10 లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు.సంఘటనా ప్రాంతం నుంచి ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్, పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎన్కౌంటర్ తర్వాత భద్రతా సిబ్బంది ఇతర మావోయిస్టుల స్థావరాలను గుర్తించేందుకు అటవీప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నామని మావోయిస్టులు తెలియజేసినప్పటికి బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని పలు ప్రజాసంఘాలు, పౌర హక్కుల నేతలు, వామపక్షాలు మండిపడున్నాయి.
ఝార్ఖండ్ అడవుల్లో కాల్పులు..ఒక మావోయిస్టు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES