- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : విజయవాడ బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో పోలీసుల తనిఖీల సమయంలో కాల్పుల కలకలం రేగింది. వరంగల్ జిల్లా నెల్లికుదురుకు చెందిన ఓ వ్యక్తి తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ ట్రిగ్గర్ సమస్యతో బుల్లెట్ బయటకు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -



