Thursday, June 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమెక్సికోలో కాల్పులు కలకలం.. 12 మంది మృతి

మెక్సికోలో కాల్పులు కలకలం.. 12 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మెక్సికోలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. గ్వానాజువాటలోని ఇరాపువాటో నగరంలో స్ట్రీట్‌ ఫెస్టివల్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంద్రి మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో రాత్రివేళ కొందరు వ్యక్తులు ఓ స్ట్రీట్‌ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా డ్రమ్స్‌ వాయిస్తూ డ్యాన్స్‌ చేస్తూ ఉండగా.. గుర్తు తెలియని దుండగుడు అక్కడి వచ్చి వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనను మెక్సికన్‌ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ తీవ్రంగా ఖండించారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. గత నెలలో, గ్వానాజువాటోలోని శాన్‌ బార్టోలో డి బెర్రియోస్‌లో కాథలిక్‌ చర్చి నిర్వహించిన పార్టీని లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -