Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వల్ప కాలిక నైపుణ అభివృద్ధి శిక్షణ...

స్వల్ప కాలిక నైపుణ అభివృద్ధి శిక్షణ…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్  ఆదేశాల మేరకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం కొరకు ప్రభుత్వ , ప్రైవేటు శిక్షణా సంస్థల ద్వారా  దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి  యం జయమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపినారు. యాదాద్రి భువనగిరి జిల్లా లోని ముస్లింలు, బౌద్ధులు, పార్సీలు, సిక్కులు , జైనులు వంటి మైనారిటీ వర్గాలకు చెందిన విద్యావంతులైన, నిరుద్యోగ మైనారిటీ యువతకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ  అనుబంధమైన ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణా సంస్థల ద్వారా ఐటి  నైపుణ్యాభివృద్ధి ఉచిత శిక్షణ అందిచటం జరుగుతుందనీ, ఎంపికైన సంస్థలు శిక్షణ ఇవ్వడమే కాకుండా, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించవలసి ఉంటుందనారు. 

ఇన్ స్టిట్యూట్ యొక్క రిజిస్ట్రేషన్ / ఇన్ కార్పొరేషన్ సర్టిఫికేట్ వివరాలు, చిరునామా  ఫోన్ నెంబర్,  నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తో అనుబంధ ధృవీకరణ పత్రం, గత మూడు ఆర్థిక సంవత్సరాల ఆదాయ పన్ను రిటర్న్స్, ఆడిట్ నివేదికలు. గత మూడు సంవత్సరాలుగా అందించిన నైపుణ్య శిక్షణ పనితీరు,  సంబంధిత ప్రభుత్వ  (రాష్ట్ర/కేంద్ర) ఏజెన్సీలు జారీ చేసిన కోర్సు పూర్తి సర్టిఫికెట్లు/వర్క్ ఆర్డర్లు, సంస్థ అందించిన శిక్షణల ప్రభావంతో మూడవ పార్టీ అసెస్‌మెంట్ సర్టిఫికెట్లు, సంస్థ అందించిన శిక్షణల విజయ గాథల ఫోటోలు, గత సంవత్సరం ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌ల కింద ఉపాధి అందించిన ప్రామాణీకరించబడిన పత్రాలు / బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు తప్పనిసరి,  జిల్లాల్లో ఉన్న శిక్షణా కేంద్రాల వివరాలు, శిక్షణా సిబ్బంది అర్హతతో కూడిన జాబితా ఉండాలన్నారు. మైనారిటీ యువతకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న శిక్షణా సంస్థలు గత 3 సంవత్సరాల పనితీరుకు సంబంధించిన డాక్యుమెంట్‌లను ప్రాజెక్ట్ రిపోర్టుతో జతచేసి హార్డ్ కాపీలను నవంబర్ ఆరవ తేదీ సాయంత్రం 05.00 గంటల లోపు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖా లో  సమర్పించగలరనీ కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -