”మేక్ ఇన్ ఇండియా-మేడ్ ఇన్ ఇండియా, విదేశీ వద్దు-స్వదేశీ ముద్దు” ఇదీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్లోగన్. బహిరంగ సభలు, మన్‌కీ బాత్ లాంటి వేదికలపై ఉత్సాహంగా, ఆకట్టుకునేలా ప్రసంగిస్తారు. మన ప్రధాని మాటలకు అర్థలు వేరులే.అన్నట్లుగా ఆచరణలో కనబడుతుంటుంది. ఇందుకు తెలంగాణలోని ఖాదీ వస్త్ర పరిశ్రమనే ఉదాహరణ. స్వాతంత్రానికి ముందు, ఆ తరువాత 2014 వరకు ఆదరణ లభించిన ఖాదీ పరిశ్రమ..నేడు మూసివేత దిశలో కొట్టుమిట్టాడుతోంది. చాలాచోట్ల వస్త్ర పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆదరణ, ప్రోత్సాహకాలు లేక ఉత్పత్తులు సాగించలేని దుస్థితికి నెట్టవేయబడ్డాయి.
స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో 1919లో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఖాదీ వస్త్ర పరిశ్రమకు 1948 వరకు మహాత్మా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఖాదీ పరిశ్రమకు అధ్యక్షులుగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఖాదీ విలేజ్ ఇండిస్టీస్ కమీషన్ (కేవీఐసీ), ఖాదీ బోర్డులు ఏర్పాడ్డాయి. వస్త్ర ఉత్పత్తితో గ్రామాల్లో ప్రారంభమైన కుటీర పరిశ్రమ ఇతర రంగాలకు విస్తరించింది. ఖాదీ కమీషన్ కిందనే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాడ్డాయి. వాటికి నలభైశాతం రాయితీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. బడా కార్పోరేట్, విదేశీ వస్త్ర పరిశ్రమలు ఏర్పాడ్డాక..చిన్న, మధ్య తరహా కుటీర వస్త్ర పరిశ్రమ కుదేలైంది. ఇందులో మొదటి వేటు ఖాదీ పరిశ్రమపైనే పడింది. నాణ్యమైన పత్తి నుండి దారంగా (చేతి ద్వారా స్పిన్నింగ్), ఆ తరువాత మగ్గం ద్వారా ఖద్దరు వస్త్రాన్ని ఉత్పత్తి చేసి ఆయా ప్రాంతాల్లో అమ్మకాలు సాగించే వావిలాల, మెట్‌పల్లి ఖాదీ సంస్థలు..కార్పోరేట్ పరిశ్రమలతో పోటీ పడలేక, కేంద్ర ప్రభుత్వం నుండి ప్రోత్సాహం లేక మూసివేత దశకు చేరుకున్నాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలోని ఖాదీ పరిశ్రమకు దేశ వ్యాప్త చరిత్ర ఉంది. ఈ ఖాదీ సంస్థకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ ఎంపీలు కెప్టెన్ లక్ష్మికాంతారావు, వొడితెల రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి అధ్యక్షులుగా వ్యవహరిం చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ, పీవీ కూతురు వాణీదేవి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇక్కడ ఉత్పత్తి అయిన జాతీయ జెండా ఎర్రకోటపై రెపరెపలాడేది. ఇక్కడి ఖద్దరు వస్త్రాలు ఇరత రాష్ట్రాల్లో ప్రాచూర్యం పొందేవి. గతంలో వేల సంఖ్యలో ఉన్న కార్మికులు..ఇప్పుడు కనీసం యాభై మంది కూడా పని చేయని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుతం ఈ ఖాదీ పరిశ్రమ మూసివేత దశలో ఉంది. రెండేండ్లుగా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన మార్కెటింగ్ డెవలాప్‌మెంట్ అసిస్టెన్స్ (ఎండీఏ) ఇతర నిధులు రావడం లేదని ఇక్కడి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్‌పల్లి ఖాదీ పరిశ్రమ కూడా బారీష్టాలు ఎదుర్కొంటుంది. స్పిన్నర్, వీవింగ్ కార్మికులకు చేతినిండా పని కల్పించలేని పరిస్థితులు నెలకొన్నాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, పూడూరు..కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆస్తులున్నాయి. ఖాదీ పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పూడూరులోని కొంత స్థలం విక్రయానికి పెట్టగా..అది వివాదానికి దారితీసింది.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాదీ పరిశ్రమను పరిరక్షణకు, అభివృద్ధికి పట్టించుకునే దిక్కులేదు. ఆయా జిల్లా కేంద్రాల్లో పరిశ్రమల కేంద్రం ఉన్నప్పటికీ..ఇక్కడి అధికారులకు ఖాదీ పరిశ్రమపై కనీస అవగాహన లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం పథకాలు, ఇతర నిధులపై జిల్లా స్థాయి అధికారులతో పార్లమెంటు సభ్యులు దిశ సమావేశం నిర్వహిస్తారు. కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజరు, ధర్మపురి అరవింద్ వారి పరిధుల్లోని ఖాదీ పరిశ్రమల గురించి ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. వారి పరిధుల్లోని వావిలాల, మెట్‌పల్లి ఖాదీ పరిశ్రమలను సందర్శించి..కేంద్రం నుండి రావాల్సిన నిధులు, ప్రోత్సాహకాలను అందించేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి అధ్యక్షులు మహాత్మా గాంధీ, వారి స్వదేశీ ఉద్యమస్ఫూర్తితో ఏర్పడ్డ వావిలాల, మెట్‌పల్లి ఖాదీ పరిశ్రమలను కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై ఉంది.
చిలగాని జనార్థన్
8121938106
ఖాదీ పరిశ్రమను కాపాడరా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



