Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమ్ముదామా..ఆగుదామా.?

అమ్ముదామా..ఆగుదామా.?

- Advertisement -

పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన..
నవతెలంగాణ – మల్హర్ రావు

పత్తి విక్రయాలపై రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. ఆదివారం నుంచి జిన్నింగ్ మిల్లులు సమ్మెకు వెళ్లారు.సీసీఐ కొనుగోళ్లు ప్రశ్నార్ధకంగా మారింది. పత్తి దిగుబడులు ఇప్పుడిప్పుడే ఎక్కువస్థాయిలో వస్తుండగా విక్ర యాలపై ఎఫెక్ట్ పడుతోంది. ఎల్1, ఎల్2, ఎల్3 పేరుతో చెల్లింపులు చేయడం తగదని జిన్నింగ్ మిల్లులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఎకరాకు ఏడు క్వింటాళ్లే విక్రయించాలన్న నిబంధన రైతన్నకు గుదిబండగా మారింది. పత్తిని విక్రయించే కీలక సమయంలోనే ఆటు 7క్వింటాళ్ల నిబంధన, ఇటు జిన్నింగ్ మిల్లుల సమ్మె విక్రయాలపై ప్రభావం చూపుతోంది. దీంతో పత్తిని అమ్మేద్దామా.. అగుదామా అన్న మీమాంస రైతన్నది.

అడుగడుగునా ఆటంకాలే..
పత్తి వేసిన నుంచి రైతులకు కష్టాలే. ఆరంభంలో సకాలంలో వర్షాలు కురిసి సంతోషం నింపగా అంతలోనే ఆకాల వర్షాలు విరుచుకుపడగా పెట్టుబడి తడిసిమోపెడైంది. స్వల్ప విరామంతోనే భారీవర్షాలు కురియడంతో పైరు ఎదుగకపోగా కోలుకోని దెబ్బతీశాయి. కలుపు నివారణకు మళ్లీ మళ్లీ ఖర్చు చేయాల్సి రాగా కూలీల కొరతతో అధిక కూలీ చెల్లించి ఆర్థికంగా నష్టపోయారు. తొలి పత్తి, రెండో పత్తి తీయగా కూలీలను ఎక్కువగా వినియోగించారు.పైపెచ్చు కూలీ రేటు అధికం. తీరా పంట చేతికొచ్ఛిన దశలో అమ్ముకుందామంటే దళారుల దోపిడీతో చిక్కిశల్యమవుతున్నారు. మార్కెట్ ఆరంభంలో ధరలను పెంచి మార్కెట్కు పత్తి ఎక్కువగా వచ్చే సమయంలో కూటమి కట్టి ధరలను అమాంతం తగ్గిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర పొడవు పింజ రకానికి క్వింటాలు రూ.8,110 కాగా మధ్య రకం రూ.7,710గా నిర్ణయించగా మార్కెట్లలో, జిన్నింగ్ మిల్లులో వేయి తక్కువగా కొనుగోలు చేస్తూ రైతుల శ్రమను దోచేస్తున్నారు.

హవ్వా.. ఎకరా ఏడు క్వింటాళ్లా?

పత్తి కొనుగోళ్లలో ఏడు క్వింటాళ్ల నిబంధనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే సవరించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఎర్ర నేలలో సాగునీటి లభ్య తను బట్టి ఎకరాకు 8 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశముండగా నల్లరేగడి నేలలో ఎకరాకు 15-20క్వింటాళ్ల దిగుబడి రావడం సహజం.ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే విక్రయిం చేందుకు సీసీఐ అనుమతిస్తోంది. మిగతా పత్తిని ఎవరికి విక్రయించాలని ప్రశ్నిస్తున్నారు. ఏడు క్విం టాళ్ల వరకు విక్రయించిన రైతులు మిగతా పత్తిని అమ్మేందుకు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. కేంద్రం నిబంధనను సడలిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -