Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయంఇండిగో అకౌంటబుల్ మేనేజర్‌కు షోకాజ్ నోటీసు

ఇండిగో అకౌంటబుల్ మేనేజర్‌కు షోకాజ్ నోటీసు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు నోటీసులు జారీ చేసిన ఒక రోజు వ్యవధిలోనే, తాజాగా ఆదివారం ఇండిగో అకౌంటబుల్ మేనేజర్‌కు కూడా షోకాజ్ నోటీసు ఇచ్చింది.

మరోవైపు, తాము రోజుకు 1,500 విమానాలు నడుపుతున్నామని, 95 శాతం నెట్‌వర్క్‌ను పునరుద్ధరించామని ఇండిగో ప్రకటించింది. అయినప్పటికీ, ఆదివారం కూడా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాలు రద్దవడంతో ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -