నవతెలంగాణ – మద్నూర్
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఆరవ జిల్లా స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ – 2025 లో స్థానిక విద్యార్థిని ప్రతిభ చాటింది. మదూర్ ఉమ్మడి మండల సిర్పూర్ గ్రామానికి చెందిన జ్యోతి సంతోష్ ఆప్ప దంపతుల కుమార్తె 8వ తరగతి విద్యార్థిని ఎం.శ్రద్ధ యోగాసన హ్యాండ్ బ్యాలెన్స్ విభాగంలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ గెలిచి, గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా అదనపు డీసీపీ బసవ రెడ్డి , టీచర్స్ అసోసియేషన్ సభ్యుడు విద్యాసాగర్ ఆమెను సత్కరించారు.
అదనంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కూడా శ్రద్ధను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ఆకాంక్షించారు. మారుమూల ప్రాంతం నుండి ప్రతిభ చాటిన ఈ బాలిక విజయం పట్ల ప్రాంతీయ ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మద్నూర్ ఉమ్మడి మండల ప్రజాప్రతినిధులు, స్థానిక పెద్దలు శ్రద్ధకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
గోల్డ్ మెడల్ సాధించిన సిరిపూర్ విద్యార్థిని శ్రద్ధ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES