Saturday, November 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅమెరికాలో షట్‌డౌన్‌-కార్మిక వర్గంపై ప్రభావం!

అమెరికాలో షట్‌డౌన్‌-కార్మిక వర్గంపై ప్రభావం!

- Advertisement -

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన అమెరికాలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా ఒక వింత సమస్య తరచుగా తలెత్తుతున్నది. అదే ప్రభుత్వ కార్యకలాపాల నిలుపుదల లేదా షట్‌ డౌన్‌. ఇలా ఎందుకు జరుగుతున్నది? అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగాలంటే అవసరమైన ఖర్చు పెట్టడానికి అక్కడి పార్లమెంటు చట్టపరమైన అనుమతి కావాలి. దేశం అప్పుల పాలు కాకుండా ప్రభుత్వ దుబారా ఖర్చులను నిరోధించేందుకు 1870వ సంవత్సరంలో యాంటీ డెఫిషియన్సీ చట్టం (ఏడీఏ)ద్వారా ఈ విధానం ప్రవేశపెట్టారు. ఫెడరల్‌ ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులందించేందుకు పార్లమెంట్‌ తప్పనిసరిగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే బడ్జెట్‌ ఆమో దించాలి. అందులో విఫలమైతే, దేశంలోని పలు విభాగాల సేవలు మూసివేయబడతాయి. దీనినే ప్రభుత్వ షట్‌ డౌన్‌ అంటారు. వందమంది సభ్యులున్న సెనేట్‌లో మెజారిటీకి అవసరమైన అరవై ఓట్లు పొందలేని కారణంగా ఈ బిల్లు ఆమోదం పొందలేకపోయింది. దీంతో పాటు ఆమోదం పొందాల్సిన రిపబ్లికన్‌ ఫండింగ్‌ బిల్లు కూడా వీగిపోయింది. అందువలన అక్టోబర్‌ ఒకటి 2015 నుండి అమెరికాలో షట్‌ డౌన్‌ మొదలైంది.

అధికార రిపబ్లికన్‌ పార్టీ (డోనాల్డ్‌ ట్రంప్‌), ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సంక్షోభానికి దారితీసింది. ఆరోగ్య సంరక్షణ నిధులు కొనసాగించాలని, వలస విధానాలు వంటి కీలక రాజకీయ డిమాండ్లను నిధుల బిల్లుకు జతచేయాలని డెమోక్రాట్లు డిమాండ్‌. డెమోక్రాట్ల పాలనలో రాష్ట్రాలకు కేటాయించిన అభివృద్ధి నిధులను నిలిపివేయడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని తొలగిస్తానని బహిరంగంగా ట్రంప్‌ బెదిరించడం ఈ షట్‌డౌన్‌కి ప్రధాన కారణాలుగా మీడియా, పరిశీలకులు చెబు తున్న విషయాలు. పాలకవర్గాలకు దేశ ప్రజలకంటే కార్పొరేట్‌ ప్రయోజనాలే ప్రధానంగా తెరమీదకి రావడంతో షట్‌డౌన్‌ దుస్థితి పదే పదే దాపురిస్తున్నది. అమెరికాలోని రెండు ప్రధాన పాలకవర్గ పార్టీలైన రిపబ్లిక్‌, డెమొక్రాట్‌ పార్టీలు రెండు పైకి నినాదాలు ఏమిచ్చినప్పటికీ ఆచరణలో కార్పొ రట్‌ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్నాయడంలో సందేహం లేదు.

కార్మిక వర్గంపై ప్రభావం
షట్‌డౌన్‌ కారణంగా లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు జీతంలేని బలవంతపు సెలవులకు నెట్టివేయబడుతున్నారు. షట్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత వారిలో కొందరికి కొంతమేర జీతాలిచ్చే అవకాశం ఉంది. కానీ అనేక డిపార్ట్‌మెం ట్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి తీసుకోబడినప్పటికీ షట్‌డౌన్‌ కాలంగా కోల్పోయిన వేతనాలు మాత్రం తిరిగి పొందడం లేదు. ఇది అడ్మినిస్ట్రేటివ్‌ డిఫాల్ట్‌ కాదు, వర్గ ప్రయోజనాల రాజకీయ కారణంగా జరిగింది. బడ్జెట్‌ ఆమోదించకపోవడం అనేది కార్పొరేట్ల కనుసన్నల్లో నడిచే పార్టీలకు వారి రాజకీయ కోర్కెలు తీర్చుకునే ఆయుధంగా మారిం ది. ఎవరు అధికారంలో ఉన్న తరచూ ఈ ఆయుధం ప్రయోగిస్తూనే ఉండటం వల్ల అనేకసార్లు ఇలాంటి షట్‌డౌన్‌ సంక్షోభాలు తలెత్తాయి. ట్రంప్‌ హయాం లో అది మరింత ప్రమాదకరంగా మారింది.

అందువల్ల నేడు అమెరికాలో నేషనల్‌ సెక్యూరిటీ, పబ్లిక్‌ సేఫ్టీ, ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ప్రాపర్టీ ఇబ్బందిగా మారింది. అమెరికాలో 65 నుండి 75శాతం ఉద్యోగులు, కార్మికులు ఈ నెల జీతం అయిపోయి మరుసటి నెల జీతం కోసం ఎదురు చూస్తూ జీవిస్తారు.అందువల్ల ఇంటి అద్దెలు, కరెంటు, వాటర్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకులు, విద్య, వైద్యం లాంటి యుటిలిటీ బిల్స్‌ చెల్లించలేని స్థితికి చేరుకున్నారు. అనేకమంది ఎసెన్షి యల్‌ వర్కర్స్‌ యొక్క ఉద్యోగాలు పోవడం వల్ల వారి కుటుంబాలకు తిండి పెట్టలేక ఫుడ్‌ బ్యాంకులకు తరలించాల్సిన దారుణమైన పరిస్థితి వచ్చింది. అలాగే స్కిల్డ్‌ ప్రొఫెషనల్‌ కూడా ూతీఱరశీఅ స్త్రబaతీసర గాను, ఉబర్‌ డ్రైవర్స్‌ గాను, లిఫ్ట్‌ ఆపరేటర్స్‌గాను పనిచేయాల్సి వస్తున్నది. సకాలంలో ఈఎంఐలు చెల్లించ లేకపోవడం వలన వారి సిబిల్‌ స్కోర్‌లు పడిపోయాయి. అలాగే రోజువారి అవసరాలకు క్రెడిట్‌ కార్డులు వాడి సకాలంలో ఆయా మొత్తాలను చెల్లించకపోవడం వలన, వాటిపై వడ్డీల భారం పెరిగి అప్పు మరింత పెరిగిపోతున్నది. ఉద్యోగాలు లేక జీతాలు లేక కొనుగోలు శక్తి తగ్గటం వలన అనేక పలు వ్యాపారాలు మూతపడ్డాయి. అందువలన కాఫీ షాపులలో, ఐటీ సంస్థలలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు, అలబామా, హంట్‌ విల్లే ప్రాంతాలలో నివసించే వ్యవసాయ పరిశోధకులు, ఓహాయోలో ఉండే విఏ నర్సులు, కాలి ఫోర్నియాలో ఉండే ఫారెస్ట్‌ ఫైర్‌ ఫైటర్స్‌, టెక్సాస్‌లో ఉండే బోర్డర్‌ ఏజెంట్స్‌ లాంటి అసంఘటిత రంగ కార్మికులు ఉద్యోగాలు, జీతాలు కోల్పోయారు. అంతేగాకుండా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ (ఏటిసి), ట్రాన్స్‌పోర్ట్‌ స్టేషన్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (టిఎస్‌ఎ)లలో జీతం లేకుండా పనిచేయాల్సి రావడం వలన వారిలో తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ రంగాల్లో ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌ను తీసివేయడం వల్ల ఎయిర్‌ ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడుతున్నాయి. లాస్‌ఏంజిల్స్‌ లాంటి ముఖ్యమైన చోట టర్మినల్స్‌ మూసివేశారు. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారు నేడు అమెరికాలో 14లక్షల వరకు ఉంటారు. వీరందరూ వాషింగ్టన్‌ డిసి లాంటి మెట్రోపాలిటన్‌ సిటీలలో 15శాతం నివసిస్తుండగా మిగతా 85శాతం వివిధ రాష్ట్రాలు, టెరిటరీలలో ఉంటున్నారు. అందువలన ఇది ప్రాంతీయ సమస్య కాదు. మొత్తం అమెరికా దేశ సమస్యగా మారింది.

అంతేగాకుండా షట్‌ డౌన్‌ వల్ల ప్రభుత్వ (ఎస్‌ఎన్‌ఏపి) సప్లిమెంటల్‌ న్యూట్రిషన్‌ అసిస్టెంట్‌ ప్రోగ్రాంకి నిధులు సమకూర్చడం ఆపివేసింది. ఈ పథకం ద్వారా 42 లక్షల పేద ప్రజలకు అమెరికా ఫుడ్‌ అందిస్తూ ఆదుకుంటున్నది. ఇది దేశ జనాభాలో పది శాతం. దీనివల్ల పిల్లలు, పేదలు, ముసలివారే ఎనభై శాతం ప్రయోజనం పొందుతున్నారు. ఎస్‌ఎన్‌ఎపి పథకం ఆగిపోవడం వలన అగ్రికల్చరల్‌ వస్తువుల అమ్మకం దెబ్బతిన్నది. ఈ పథకం అనేది ఈబీటి (ఎలక్ట్రానిక్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) కార్డు ద్వారా బదిలీ చేయబడి పేదలకు ఆసరాగా ఉండేది. ఇలా ఫెడరల్‌ ప్రభుత్వ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయి జీతాలు లేక, పేదల ఎస్‌ఎన్‌ఏపీ పథకం ఆగిపోవడం వలన ప్రజలు డబ్బు ఖర్చు చేయలేని స్థితికి వచ్చారు. అందువల్ల రెస్టారెంట్లు, కాఫీ షాపులు, చిన్నచిన్న రిటైలర్స్‌, ప్రభుత్వ ఆఫీసులు, మిలటరీ బేసిన్‌లలో కస్టమర్స్‌ పూర్తిగా తగ్గిపోయారు. ఇది స్థానిక ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థపై పడింది.

ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం
ఈషట్‌డౌన్‌ అమెరికా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. దేశానికి ఊహించని నష్టాన్ని తెచ్చింది. ఇక్కడి ఆర్థిక అనిశ్చితి వల్ల ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు, విదేశీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా తన దేశ బడ్జెట్‌ ఆమోదింప చేసుకోలేక పోవడం, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడుదారుల విశ్వాసాన్ని దెబ్బతీ స్తున్నది. ఇది ప్రపంచ పెట్టుబడుల ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అంతేకాక అనేక కీలకాంశాల సమాచారాన్ని సేకరించే సంస్థల కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ సమాచారం లేకపోవడం వల్ల ప్రపంచ బ్యాంకులతో సహా అంతర్జాతీయ సంస్థలు, ఫెడరల్‌ రిజర్వ్‌ వంటివి సరైన నిర్ణయాలు తీసుకోలేవు. షట్‌డౌన్‌ ఎక్కువకాలం కొనసాగితే అమెరికన్‌ కంపెనీలు ఖర్చులను తగ్గించుకుం టాయి. దీనివల్ల మన దేశ ఐటీ సేవల ఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పెరిగి భారత స్టాక్‌ మార్కెట్లు నష్టపోవడం, రూపాయి విలువ తగ్గడం వంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు.

షట్‌డౌన్‌ ఎక్కువకాలం కొనసాగితే అమెరికా అభివృద్ధి మందగించడంతో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. అంతర్జాతీయ సహాయ కార్యక్రమాలు, వీసా ప్రక్రియలు వంటివి ఆగిపోవడం వల్ల విదేశీ సంబంధాలు దెబ్బతింటాయి. మిక్కిలి బాధాకరమైన ప్రభావం హెచ్‌1బి వీసా, గ్రీన్‌ కార్డ్‌ ప్రక్రియలో ఏర్పడిన అంతరాయం. నిధుల కొరత కారణంగా యుఎస్‌ కార్మికశాఖలోని ఫారెన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ కార్యాలయం అన్ని కార్యకలాపాలను నిలిపివేయ డంతో, కొత్త హెచ్‌1బి వీసా పిటిషన్‌లు దాఖలు చేయడానికి లేదా ఉద్యోగాన్ని మార్చడానికి అవసర మైన ముందుగా లేబర్‌ కండిషన్‌ అప్లికేషన్‌ పై డీవోయల్‌ ధ్రువీకరణను పొందలేకపోతున్నారు. అందువలన హెచ్‌1బి వీసాల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న నైపుణ్యం గల భారతీయులు వేలాదిమంది అనిస్థితిలో చిక్కుకున్నారు. వారి ఉద్యోగ మార్పిడిలు కొత్త నియామకాలు నిరవధికంగా ఆగిపోయాయి. అదే విధంగా శాశ్వత నివాసానికి అవసరమయ్యే గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తుల ప్రక్రియ కూడా స్తంభించింది. మరి దీనికి పరిష్కార మేమిటి? షట్‌ డౌన్‌ వర్గ రాజకీయ విభేదాల ఫలితంగా వచ్చింది. అందుకే పరిష్కారం కాంగ్రెస్‌ లోని ఇరు పార్టీల చేతుల్లోనే ఉంది. ఇరువురు వారి కార్పొరేట్‌ల ప్రయోజనాల కంటే దేశం, ప్రజల, కార్మిక వర్గ ప్రయోజనాలే ప్రధానంగా భావించి షట్‌డౌన్‌కి శాశ్వతంగా ముగింపు పలకాలి. న్యూయార్క్‌ నగర పాలక ఎన్నికల ఫలితాల అనంతరమైనా అమెరికా పాలకులు ఆ దిశగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ముందుకు వచ్చింది.
ఏ.వి.రావు
7382800932

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -