నవతెలంగాణ-హైదరాబాద్: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమంగ్ ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని శుక్రవారం ఉదయం సిఆర్‌హెచ్ మెడికల్ సూపరింటెండెంట్ విడుదల చేసిన ఒక ప్ర కటన పేర్కొంది. అధిక రక్తపోటుతో ముక్కు నుండి రక్త స్రావం కావడంతో గురువారం ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని ప్రకటన పేర్కొంది.
జమ్మూ కాశ్మీర్‌లోని నగ్రోటా స్థానంలో బీజేపీకి అభ్యర్థి దేవయాని రాణా 24,647 ఓట్ల అధిక్యతతో గెలిచారు.మిజోరంలోని డంపా బైపోల్‌లో మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి విజయం సాధించాడు. ఆర్ లాల్తాంగ్లియానా 562 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాజస్థాన్‌లోని అంటా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విక్టరీ సాధించారు. బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్‌పై ప్రమోద్ జైన్ 15,612 ఓట్ల తేడాతో గెలుపొందారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హస్తం అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ 24వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.



