Tuesday, October 28, 2025
E-PAPER
Homeఆటలుతప్పుకున్న సింధు

తప్పుకున్న సింధు

- Advertisement -

గాయంతో ఈ సీజన్‌కు దూరం
హైదరాబాద్‌ :
భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి షట్లర్‌, రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత పి.వి సింధు ఈ ఏడాది బిడబ్ల్యూఎఫ్‌ టూర్‌ సీజన్‌కు దూరమైంది. పి.వి సింధు (30) ఈ ఏడాది యూరోపియన్‌ సీజన్‌ ఆరంభంలో కాలు గాయానికి గురైంది. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోకుండానే బరిలోకి దిగిన పి.వి సింధు ఎక్కువగా తొలి, రెండో రౌండ్లలోనే పరాజయాలు చవిచూసింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో పరాజయం అనంతరం పి.వి సింధు ఆశించిన ఆటతీరు కనబరచలేదు. ఇండియా ఓపెన్‌ సూపర్‌ 750, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ సహా చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోవటమే ఈ సీజన్లో సింధు అత్యుత్తమ ప్రదర్శన. చివరగా నిరుడు డిసెంబర్‌లో సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 టైటిల్‌ సాధించిన పి.వి సింధు.. వచ్చే ఏడాది పునరాగమనంపై గురి పెట్టింది. ప్రముఖ స్పోర్ట్స్‌ ఆర్థోపెడిషియన్‌ డాక్టర్‌ దిన్షా పర్దావాల సహా ఇతర వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఈ ఏడాది బ్యాడ్మింటన్‌ సీజన్‌కు పూర్తిగా దూరం అవ్వాలని సింధు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింధు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -