నవతెలంగాణ – జైపూర్
20 వేల మొక్కలు నాటిన సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. మంగళవారం కొత్తగూడెం జీకే ఓసీ డంప్‌పై 230 మొక్కలు నాటి ఈ రికార్డు సొంతం చేసుకున్నారు.పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా విశ్వగురు వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఈ సందర్భంగా విశ్వగురు వరల్డ్ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా సీఎండి బలరాం మెమెంటో ను అందుకున్నారు. గడిచిన ఆరు సంవత్సరాల్లో సింగరేణి వ్యాప్తంగా 35కు పైగా చిట్టడవులను సృష్టించారు. దేశంలో 20 వేల మొక్కలను నాటిన మొదటి సివిల్ సర్వీసెస్ అధికారిగా రికార్డు తాను మొక్కలు నాటిన ప్రదేశాలకు జియో ట్యాగింగ్ చేయించడం విశేషం. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు, డి.సత్యనారాయణ రావు, ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు పాల్గొన్నారు.
ప్రపంచ రికార్డు నెలకొల్పిన సింగరేణి సిఎండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES