Sunday, December 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం జల్సాలకు సింగరేణి కార్మికుల సొమ్ము

సీఎం జల్సాలకు సింగరేణి కార్మికుల సొమ్ము

- Advertisement -

బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆరోపణ

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సింగరేణి కార్మికుల సొమ్మును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జల్సాలకు ఉపయోగిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మెస్సీతో ఫుట్‌బాల్‌ ఆడేందుకు సీఎం ఏకంగా గ్రౌండ్‌నే నిర్మించారని తెలిపారు. రేవంత్‌రెడ్డి పది నిమిషాల జల్సా కోసం రూ. వంద కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ధనం సింగరేణి కార్మికుల చెమట చుక్కల నుంచి వచ్చిందని తెలిపారు. సింగరేణి కార్మికుల సొమ్మును వారి సంక్షేమం కోసం ఉపయోగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -