Thursday, December 4, 2025
E-PAPER
Homeజాతీయంస‌ర్ ప్ర‌క్రియ‌..సుప్రీం కోర్టు కీల‌క నిర్ణ‌యం

స‌ర్ ప్ర‌క్రియ‌..సుప్రీం కోర్టు కీల‌క నిర్ణ‌యం

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఇటీవల కేంద్రం ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో రెండో విడత స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR)ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ బూత్‌ లెవల్‌ అధికారుల (BLO)పై పని తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఎల్‌వోలపై పనిభారం తగ్గించేందుకు అదనంగా సిబ్బందిని నియమించాలని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్‌ ప్రక్రియలో విధుల నుంచి మినహాయింపు కావాలంటూ స్పష్టమైన కారణాలు చెప్పిన బీఎల్‌వోల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. వారి స్థానంలో సమర్థులైన అధికారులు, ఇతర సిబ్బందిని కేస్‌ టూ కేస్‌ ఆధారంగా నియమించాలని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -