Thursday, July 31, 2025
E-PAPER
Homeజాతీయంఎస్‌ఐఆర్‌ను సవరించాలి

ఎస్‌ఐఆర్‌ను సవరించాలి

- Advertisement -

ఈసీపై ఒత్తిడిని పెంచాలి :
ప్రజలకు రిటైర్డ్‌ సివిల్‌ సర్వెంట్ల పిలుపు

పాట్నా : బీహార్‌లో జరుగుతోన్న వివాదాస్పద స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) పట్ల ఇప్పటికే అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అంశంపై కాన్‌స్టిట్యూషనల్‌ కండక్ట్‌ గ్రూప్‌ (సీసీజీ)కి చెందిన రిటైర్డ్‌ సివిల్‌ సర్వెంట్లు సైతం స్పందించారు. ఎస్‌ఐఆర్‌ను సవరించాలని ఎన్నికల సంఘం (ఈసీ)పై ఒత్తిడి పెంచాలని ప్రజలు వారు పిలుపునిచ్చారు. ఇందులో దాదాపు 93 మంది మాజీ సివిల్‌ సర్వెంట్లు ఉన్నారు. వీరిలో మాజీ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ నితిన్‌ దేశారు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాజీ సలహాదారు టి.కె.ఎ నాయర్‌ వంటి రిటైర్డ్‌ సివిల్‌ సర్వెంట్లు ఉన్నారు. పలు అంశాల్లో తాము దాఖలు చేసిన పిటిషన్లు విస్మరించబడ్డాయనీ, వీటికి సంబంధించి భారత ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచేలా చేయాలంటూ ఈ బహిరంగా లేఖను రాస్తున్నామని సదరు బహిరంగ లేఖలో మాజీ బ్యూరోక్రాట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -