Wednesday, December 10, 2025
E-PAPER
Homeజాతీయం'సర్‌'ను నిలిపేయాలి

‘సర్‌’ను నిలిపేయాలి

- Advertisement -

ప్రజల పౌరసత్వాన్ని ధ్రువీకరించే అధికారం
ఎన్నికల కమిషన్‌కు లేదు : సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రస్తుత సర్‌ ప్రక్రియను నిలిపివేయాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్‌ డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన ప్రత్యేక చర్చలో అమ్రారామ్‌ ప్రజల పౌరసత్వాన్ని ధ్రువీకరించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని అన్నారు. సర్‌ ప్రక్రియ అనేది కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కమిషన్‌ చర్య తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుందన్నారు. ”బీహార్‌లో 65 లక్షల మందిని జాబితా నుంచి తొలగించారు. సర్‌ ప్రక్రియ ద్వారా చొరబాటుదారులను తొలగించడమేనని ప్రధాని, హౌంమంత్రి అంటున్నారు. బీహార్‌లో ఎంత మంది చొరబాటుదారులను తొలగించారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. జాబితాలో ఎవరైనా చొరబాటుదారులు ఉన్నట్టు తేలిందా? జాబితా నుంచి తొలగించబడిన వారందరూ జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పేదలు. వారి స్థానంలో లేని ధనవంతులందరూ తమ పేర్లను ఆన్‌లైన్‌లో నవీకరించారు. పని కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పేదలకు ఇది తెలియకపోవడంతో వారు దూరంగా ఉంచబడ్డారు. ఇది బీహార్‌లోనే కాదు, ఇతర రాష్ట్రాలలో కూడా జరుగుతుంది. ఎన్నికల కమిషన్‌, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత దెబ్బతింది. ఎన్నికల కమిషన్‌ నియామకం కోసం సుప్రీంకోర్టు ఒక వ్యవస్థను తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం దానిని దెబ్బతీసింది. ఇప్పుడు కమిషన్‌ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంది. ఈ పరిస్థితి మారాలి” అని అమ్రారామ్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -